5/15/09

వీడ్కోలు


మది నిండా కొత్త ఊహల తో జీవనం సాగించడానికి సిద్ధమైన మిత్రమా!
ఈ పాత నేస్తాల తలపులను మాత్రం మరువకు సుమా!!

మా మంచిని కోరే ఆప్తులు సుదూర తీరాల కు సాగే వేళ,

నీ కలలు నిజమయే క్షణాలు ఇవేనని
నిను నవ్వుతూ సాగనంపనా?

ఇన్నాళు మనం కలిసి గడిపిన సరదా సమయాలు
ఇక నుండి అవి తీపి గురుతులేనని కలత చెందనా ??

మన కలహాలు, కాలక్షేపాలు
అచ్చట్లూ, ముచ్చట్లూ
ఆటా, పాటలు
కొంటె పనులు, చిలిపి సంగతులతో

మా మనసుల లో చెరగని ముద్ర వేసి వీడిపొతున్న ప్రియ నేస్తమా!
నువ్వు కలవరపడతావేమో నని
నీ కంటపడక నా కనురెప్పలోనే దాగిన కన్నీరు,
ఇలా పదజాలమై జారువాలిన వేళ

అందుకో ఈ నా వీడ్కోలు !!!

-మైత్రేయి
05/15/2009, Frisco,Texas

5/12/09

తల్లడిల్లే తల్లి హృదయం




కంటి పాప కు కనురెప్ప లా
చంటి పాప ను కాపాడేది 'అమ్మ '

వెలుగు ను ఇస్తూ కరిగిపోయే కొవ్వొత్తి లా
ప్రేమ ను పంచేది 'అమ్మ '

కనుమరుగైన అల ను అక్కున చేర్చుకొన్న కడలి లా
ఎప్పటికి నన్ను చేరదీసేది 'అమ్మ '

కష్టాలలో ఆదుకొనేది 'అమ్మ '
కన్నీళ్ళలను పంచుకొనేది 'అమ్మ '

నేను ఇల్లాలి నైతే పొంగిపోయింది 'అమ్మ '
నేను తల్లి నైతే మురిసిపోయింది 'అమ్మ '

నేను 'అమ్మ ' అయిన తరువాతే అర్థం చేసుకోగలిగాను
తల్లడిల్లే తల్లి హృదయం
తపన పడే ఈ ప్రేమ మూర్తి ప్రేమానురాగం!!

అమ్మా - Happy Mother's Day May 10 2009


-మైత్రేయి

5/1/09

నా గురించి నేను

పలకరిస్తే నవ్వుల వాన కురిపిస్తా
ప్రక్రృతి ని చూసి పులకరిస్తా !

అమ్మ నాన్నల ను గౌరవిస్తా 
ప్రియమైన చెల్లి ని ఆట పట్టిస్తా ! 

స్నేహితురాళ్ళని కవ్విస్తా నవ్వుతూ 
తుళ్ళుతూ సరదాగా గడిపేస్తా !

కమ్మని సంగీత మాధుర్యం లో ఉయ్యాలలూగుతా 
మయూరి లా నన్ను నేను మరచి నటనమాడుతా' ! 

'అమ్మా' అని పిలిచే 'అభి ' పిలుపు కి మైమరచిపోతా
నన్ను చూసి కిలకిల నవ్వే 'అన్వి ' అల్లరికి కరిగిపోతా !

నా 'విజయ్' సావాసం తొ ప్రేమ ప్రపంచాన్నే జయిస్తా!!!


- మైత్రేయి
05/01/2009,Frisco,TX