8/9/17

Violet Moonlight


VIOLET MOONLIGHTతెల్లటి వెండి వెన్నెల, నల్లటి మబ్బులని చీల్చుకొని 

భువిని చేరే తాపత్రయం లో మృదువైన ఊదా రంగు గా మారిన

అనుహ్యమైన ప్రక్రియ కి ప్రక్రుతి సైతం పులకరించి పచ్చటి చెట్లు

రజత కాంతులను విరాజిల్లుతున్న 

ప్రశాంతమైన తరుణాన్ని అద్భుతం గా 

బంధించిన చిత్రమిది!


మైత్రేయి

08/09/2017, Frisco, Texas!

4/17/16

విరహ వేదనచంద్రుని చేరాలనే "కలువ" లా
సూర్యుని చేరాలనే "కమలం" లా
నిన్ను కలవాలనే ఈ "కోమలి"
ఆరాటం నీకు ఎన్నటికి తెలియునో!!!!


-మైత్రేయి


07/09/2003,Richardson,Texas

10/6/14

మనం జతగా ఇలా...!


మనం జతగా ఇలా...!
నీ చెరగని చిరునవ్వు తెచ్చేను నాకు మరింత అందం

  నా మెరుపు లాంటి చూపు ఇచ్చేను నీకు పసిడి తేజం

నీ తోడు నింపేను నా మనసంతా నిండు ధైర్యం

  నా నగుమోము నిలిపేను నీ హుందాతనం

నీ స్పర్శ మీటేను నా మది లోని రాగ తరంగం

  నా కొంటె నవ్వు తట్టి లేపేను నీ లోని కలవరం

సంసారమనే సంద్రం లోని ఒడుకుదుడుకులకు చెదరకుండా

 నిరంతరం సాగే సరాగాల హొయలొలికే అలల లా  

కలకాలం కలిసి ఉందాము మనం జతగా ఇలా...!

-మైత్రేయి 

9/9/2014, Frisco, Texas!

6/3/14

నన్ను నీ దరి చేరనీయవూ!!నీ నీడలా ఎప్పటికీ నీ వెన్నంటి ఉంటా,

నీ గుండెల్లో గువ్వనై ఒదిగిపోతా

నన్ను నీ దరి చేరనీయవూ!!


నిన్ను నవ్వించే పువ్వునౌతా,

నీ అల్లరిలో సిరిమల్లెనౌతా

నన్ను నీ దరి చేరనీయవూ!!


ముద్దులొలికే నా మోమును నీ ఓడిలో దాచుకొంటా,

నీ బాధను మరిపించే ఒదార్పునౌతా

నన్ను నీ దరి చేరనీయవూ!!


"నన్ను నీ దరి చేర్చుకో!"

-మైత్రేయి


07/10/2003, Richardson,Texas

9/15/13

Our Darling Anvi Turns 5నా గారాల పట్టీ పారాడె పసి పాదాలని ముద్దాడిన వేళ, 

పరుగెత్తె అల్లరి పిల్లని పట్టుకోలేక విసుగెత్తిన వేళ, 

ఈ గడసరి పలువురిని కవ్వించి మెప్పించిన వేళ,

బడి లో చేరి ఆట పాట నేర్చిన వేళ,  అన్న ని ఆట పట్టించిన వేళ, 

ఇయిదవ వార్షికం లో కి అడుగిడిన వేళ, 

ఈ ఞపకాలూ గుర్తు చేసెనే, నా బుజ్జి పాపాయి ఎదిగి పెద్దదయిందని, 

ఇక పై ఎత్తుకొని ముద్దాడలేనని,  ఒడిలొ లాలించలేనని   కలవరపడె నా మనసు, 

మును ముందు మా చిన్నారి ప్రయొజకురాలై  సుఖ శాంతులతొ వర్ధిల్లాలనే ఎదురు చూపుకు చిహ్నమే కదా!    

Happy 5th Birthday Anvitha!


-మైత్రేయి  

9/15/2013, Frisco,TX

5/6/13

ఓ చెలికాడా! నా నెలరేడా !!
ఓ చెలికాడా! నా నెలరేడా !!


ఆరుబయట చిరుగాలి రమ్మని పిలిచింది!

వెచ్చని చలి మంట తన నీడలో చలి కాచుకొమ్మంది!!

విరజాజి విరగపూసి హాయిగా ఆహ్వానిస్తుంది!

మల్లె పందిరి పక్క వేసి పవళించమంది!!

జామిలమ్మ వెన్నెల పరుపు వేసింది!

నీలి గగనం మేఘాలను దిండుగా పంపింది!!


అన్నింటిని మించిన నీ చెలియ చల్లని ఓడిలో సేద తీర రా రా!!!
ఓ చెలికాడా! నా నెలరేడా!!-మైత్రేయి04/23/2004,Richardson,TX

8/2/11

The Departure Time


All this longtime made us adhere,
in short notice was set departure;
Whenever you see time here,
reminds you the moments we spent together.
-The Pasam's

-Mythreyi
June 18 2011
Frisco,TX,USA.