3/25/22

పడమటి సంధ్యా రాగం

 



పడమటి సంధ్యా రాగం


వెచ్చగా నా చెక్కిలిని తాకే నీ కిరణాలు

నువ్వు వీడిపొతున్నా నిన్ను వదిలిపోవు నా చూపులు


అంబరం సైతం తన ఉనికిని మరచేను నీ మాయ లో

గిరి మాత్రం గంభీరం గా గర్చించే నీ కాంతుల ఛాయ లో


ప్రకృతి మొత్తం పులకరించి నీకు అర్పించే దాసోహం

ఇది ప్రతి రోజు జరిగే తంతే అయినా ఈ కాంతను చేశెను సంభ్రమాశ్చర్యం


నీకు నాకు మధ్య ఉన్న ఈ అవినాభావ సంబంధం

అందరికీ అంతుచిక్కని ఓ నిఘూఢ రహస్యం


మనసంతా నీ ధ్యాసతో నింపుకోని రేపటి నీ రాకకు నా కన్నులు పలుకుతాయి స్వాగతం

అప్పటి వరకు సాగనీ ఈ మధురమైన పడమటి సంధ్యా రాగం!


-మైత్రేయి

Petit Jean State Park, Arkansas

03/25/2022




1/28/22

మధురమే సుధా గానం ~ Spring into Music

 


మధురమే సుధా గానం


గుండెలోని మధురిమ
గొంతులోని సరిగమ గా మారగా!
గాత్రం అనే సిరిమల్లె వికసించెనే
గుబాళింపుల పరిమళాలు ప్రపంచమంతా పంచెనే!!


-మైత్రేయి
01/20/2022


Sunrise or Casandra Garden

 



కనకాంబరాలు దారి తప్పి,
అంబరాన్ని అంటిన వేళ,
కలవరమాయేనే నా మది లో! 

                                                                                                                                                                
     
    
🧡


When Casandra Flowers get lost in the Sky,
My Dil goes Hmmm Hmmmm! 
😍

Sunrise in Jan!

-మైత్రేయి
01/18/2022

సిరిమల్లె పూవల్లె నవ్వు

 


వాలే నీ చిరునవ్వు,
జారే జలపాతమే,
బంధించు భద్రంగా,
ఉండేలా పది కాలాలు పదిలంగా!

-మైత్రేయి
01/01/2022




మల్లెపూవు లాంటి ఓ చిరునవ్వు
నన్ను ఒదిలిపోకె ఎప్పటికి నువ్వు! ❤️

-మైత్రేయి
03/15/2017



సిరివెన్నెల గారికి నా కవితాశ్రు నివాళి

 



Rest in Peace, Sir! 
'నెల రాజు ని ఇల రాణి ని కలిపింది లే సిరివెన్నెల!' ఇంతటి అద్భుత సాహిత్యం సిరివెన్నెల గారి కే సాధ్యం! 



'సిరివెన్నెల' తో ఆరంభించి
'సిరివెన్నెల' తో ముగించి న
నీ సినీ జీవన ప్రయాణం
జగత్తు లో చేసేను నీ పేరు నే సార్థకం!

విరంచి వై ఎన్నొ కూర్పు లు రచించి
మానవాళికి అందిచావు సాహిత్య గుళికలు

విపంచి వై గగనానికి ఎగసిపోయినా
అవి మిగిల్చేను మా మదిలో మరువలేని నీ జ్ఞాపకాలు!!




మీ సాహిత్యాభిమాని
మైత్రేయి
01/28/2022