10/13/10

నువ్వు నా దరి లేవని...
చల్లని చిరుగాలి నా మేనును తాకి గుర్తు చేసింది
నువ్వు నా దరి లేవని...

మెల్లగా వాన జల్లు నా చెక్కిలిని తడిపి తెలిపింది
నువ్వు నా దరి లేవని...

కనుమరుగైన రవి కిరణాలు కొంటెగా కనుగీటి అన్నాయి
నువ్వు నా దరి లేవని...

నా జడలోని మల్లెల పరిమళాలు అల్లరి చేసెను
నువ్వు నా దరి లేవని...

ప్రకృతి లోని ఈ మధుర భావనలకు
నా మదిలో మెదిలే నీ తలపులు తీపిగా తెలిపాయి
నువ్వు నా దరి లేవని...


-మైత్రేయి
April 17 2010
Bangalore, India