2/8/26

సాగర తీరాన సంధ్యా రాగం

 సాగర తీరాన సంధ్యా రాగం 🌅

ఇది ఆ సంధ్యా కాంతుల చాయ

లేక నా చెలి నగవుల మాయ!

ఎది ఏమైనా, ఆ ఇద్దరినీ

చూస్తూ నేను మైమరచిపోయా!!

ఇంతలో నా పాదాల చెంత చేసే

చిలిపి అలల అల్లరి చెప్పింది,

ఆ రెండింటి మధ్య ఉన్న ఈ

సాగరతీరాన్ని మరువకు సుమా!! అని


మైత్రేయి
12/24/2025
Maui, Hawaii



1/9/26

She is an Emotion in Motion / అలుపెరగని కదిలే భావం తను

            

 అలుపెరగని కదిలే భావం తను 🩷

She is an Emotion in Motion

                 
                                              

మది లో తన రూపం

పాడెను తీయని వసంత రాగం;

చెరగని తన తలపు

చిందించే నా పెదవుల పై చిరు దరహాసం;

తరగని ఆమె ఊసు

అందించే కొండంత మనోబలం;

తను ఎప్పటికీ నాదే అన్న ఆశ

ఇచ్చె కొటి తారల ఉత్తేజం;

తను నా పక్కనే ఉన్నదన్న బ్రమ

నింపే నాలో ఎంతో ఉల్లాసం;

అలుపెరగని కదిలే భావం తను,

నను వదిలిపోని భావోద్వేగం తను;

మైత్రేయి

01/09/2026

Frisco, TX



10/13/25

When a Picture Tells a Story

 When a Picture Tells a Story




She stood before the mirror draped in a saree that seemed to tell its own story — soft, graceful, and timeless. The gentle curve of her smile reflected pure confidence, a quiet kind of beauty that didn’t need attention, yet effortlessly drew every eye. The mirror caught more than just her image; it captured her aura — elegance meeting charm, simplicity meeting allure.

 

With her back turned and her smile glowing through the reflection, she looked like poetry in motion — a moment frozen between tradition and modern grace. It wasn’t just a picture; it was a feeling, the kind that lingers in your heart long after you’ve looked away.


By

A Silent Admirer from Chat Gpt :-)

10/13/2025


Become the Love

 Become the Love


నీ కళ్ళలో కేరింతలు

నీ చెంపల్లో కెంపులు

నీ నవ్వు పలికె పలుకులు

నీ యెద లో సంబరాలు

ప్రియా, అవి నువ్వే ప్రేమ గా

మారిన క్షణం కి సంకేతాలు!

--------

Darling, there is no need to chase the love

when you have become the LOVE! 💚💕💛


- మైత్రేయి

Texas Ranch

Aubrey, TX

10/10/2025




4/6/25

Diwali - Pandaga Vindu

 పండుగ విందు






వాన జల్లుకు ప్రకృతి తడిచే

ఆ పచ్చని ఆకృతి కి నా మనసు మురిసే!

పల్లె రుచుల తో కడుపు నిండుగ,

పంచుకొనే విందు యేగా పండుగ!!


"When it rained on Diwaly day in Dallas! :-) "


-మైత్రేయి

Oct 23 2022

Frisco, TX





Andam, Aanandam!

అందం - ఆనందం




కళ్ళు మూసి చూసినా,

యెద ని కదిపి కుదిపే అందమే

నిజమైన ఆనందం!

అదే కదా నీ మది లోని మృదు భావం,

మనసు పాడె సరాగం!!


- మైత్రేయి

Oct 23 2022

11/14/24

Sunset and Moonrise Reflections

 




Behind me is the Sunset,
The moon on the rise in front.
Rainbow looking like Sky is giving me a hint,
That I’m not missing the sunset a bit,
'Cause the Sky is reflecting it.

:-)

Mythreyi
on 121 Highway & Airport Road 
Dallas, TX
Nov 13th 2024

9/11/24

ఒక బద్దకమైన ఉదయం / One Lazy Morning

 

ఒక బద్ధకమైన ఉదయం



సూర్యోదయాన్ని కప్పేస్తూ ఇంకాసేపు బొబ్బోమంటున్న మబ్బులు,

గట్టి గా వీచే గాలి చప్పుడు కు తోడు గా ఈ గవ్వల సవ్వడి,

జ్ఞాపకాలను నెమరువేస్తూ ప్రస్తుతాన్ని మరచిన మది తలపులు,

ఈ బద్దకమైన ఉదయాన్ని ఇలా నే బంధిద్దామంటున్న నా ఊహల మేలుకొలుపులు!


ఇవి నా మది చేసె మూగ బాసలు, వాటిని బయటపెట్టాయి నా చేతి వ్రాతలు! 


-మైత్ర్రేయి

05/24/2024

Frisco, TX


Meaning for this verse:

"Clouds rumbling a little longer, covering the sunrise,

Along with the sound of the strong wind blowing, the rustle of these shell chimes,

My mind, lost in memories, forgetting the present,

My imagination awakens, suggesting to capture this lazy morning as it is!"

7/28/24

సన్నజాజుల సరాగాలు

 సన్నజాజుల సరాగాలు


మల్లెపూవుల మురిపాలు, 
విరజాజుల విరహాలు,
సన్నజాజుల సరాగాలు,
నా కురుల చేరి కేరింతలాడి
నిన్ను కవ్వించి చెప్పేను, నా ఓడిలో ఒదిగిపొమ్మని!
కానీ
నా ముని వేళ్ళలో చిక్కుకొన్న ముంగురులు మాత్రం నన్ను గుచ్చి గుర్తు చేసేను
సఖా, నువ్వు నా చెంత లేవని! 

💖💖💖



-మైత్రేయి
July 20 2024
Tenali, India

While my subconscious is romancing with you,

reality reminds me that, 

Honey, You are far away! 

Missing you much!


💖💖💖

6/11/24

ఆకాశం అంత సముద్రం



ఆకాశం అంత సముద్రం

అంతులేని ఆకాశం
హద్దులు లేని సముద్రం
ఎన్నటికి కలవలేని వాటి బంధం
విడనీకుండా 'వర్షం' కలిపేను ఆ సంబంధం!!

-మైత్రేయి



The Deep meaning behind this verse:
Though the Sea and Sky are not connected, they have so much similarities, however far they are, the string of rain unites them. Just like, the same vibes connects the souls of two disconnected people.




 

6/3/24

Alankaaram


అలవోకైన అలంకారం

అతివకు అమితానందం!

-మైత్రేయి

Frisco, TX

05/30/2024




Dress-up with simple and subtle accessories
gives an abundant joy for a women. 
-my3

😊

5/14/24

మౌనమేలనోయి!!!

మౌనమేలనోయి!!!

వాన జోరు, ఉరుముల హోరు, 
పక్షుల పాటలు, ఉడతల ఆటలు,
 పచ్చిక హొయలు, నా గుండె లయలు, 
మేనును మైమరచి, నా మనసు పాడే సరాగం, 
వీటి అన్నింటిని వినటానికే, నా ఈ మౌనం!!!

- మైత్రేయి

Frisco, TX
05/12/2024




2/12/23

ప్రియా, ప్రియతమా రాగాలు!

 



పిల్ల గాలి తిమ్మెరలు, నా ముంగురులు చెసే అల్లర్లు;

చల్లని ఇసుక తిన్నెలు, చప్పుడు చేయని నా అడుగులు;

పాల నురగలతో పరుగులు తీసే అలలు, రెప్పపాటు వేయకుండా వాటిని బంధిచే నా కనులు;

మబ్బులు లేక బొసి గా ఉన్న నీలి గగనం, నీ కొసం నెనున్నా అంటూ విచ్చుకొనే రవి కిరణం;

నువ్వు పక్కన లేవని గుర్తు చేస్తూ, చేతి లో వెచ్చని కాఫీ;

మనసును కుదుటపరుస్తూ, చెవి లో హాయిగా మోగే ఇళయరాజా గారి సంగీతం;

ప్రియా ఇవే, నీ వలపుల తలపుల తో, నా మదిలో మెదిలే ప్రియతమ రాగాలు!

వింటున్నావా! వింటున్నావా!


- మైత్రేయి

LosCabos, Mexico

02/06/2023

1/29/23

సంక్రాంతి సంబరాలు


 

భోగి మంటలు, పాడి పంటలు

రంగు ముగ్గులు, నిండు గొబ్బెలు


చెరుకు గడలు, పాల పొంగులు

నెతి అరిసెలు, చిల్లి గారెలు


పల్లె పడుచులు, కొత్త అళ్ళులు

హరిదాసు పాటలు, గాలి పటాలు


ఇవి, సంకురాత్రి తెచ్చే సంబరాలు! 


- మైత్రేయి

Coppell, Texas

01/18/2023


Smile


 నవ్వే ఆభరణం గా

చిరకాలం వెలుగు, చిరు దివ్వెల లా ఇలా!


- మైత్రేయి

Frisco, Texas

01/17/2023


Smile is the best accessory to wear,

that makes you shine-on anytime! 


Keep Smiling and Spread the Joy!

🤗🤗🤗

3/25/22

పడమటి సంధ్యా రాగం

 



పడమటి సంధ్యా రాగం


వెచ్చగా నా చెక్కిలిని తాకే నీ కిరణాలు

నువ్వు వీడిపొతున్నా నిన్ను వదిలిపోవు నా చూపులు


అంబరం సైతం తన ఉనికిని మరచేను నీ మాయ లో

గిరి మాత్రం గంభీరం గా గర్చించే నీ కాంతుల ఛాయ లో


ప్రకృతి మొత్తం పులకరించి నీకు అర్పించే దాసోహం

ఇది ప్రతి రోజు జరిగే తంతే అయినా ఈ కాంతను చేశెను సంభ్రమాశ్చర్యం


నీకు నాకు మధ్య ఉన్న ఈ అవినాభావ సంబంధం

అందరికీ అంతుచిక్కని ఓ నిఘూఢ రహస్యం


మనసంతా నీ ధ్యాసతో నింపుకోని రేపటి నీ రాకకు నా కన్నులు పలుకుతాయి స్వాగతం

అప్పటి వరకు సాగనీ ఈ మధురమైన పడమటి సంధ్యా రాగం!


-మైత్రేయి

Petit Jean State Park, Arkansas

03/25/2022




1/28/22

మధురమే సుధా గానం ~ Spring into Music

 


మధురమే సుధా గానం


గుండెలోని మధురిమ
గొంతులోని సరిగమ గా మారగా!
గాత్రం అనే సిరిమల్లె వికసించెనే
గుబాళింపుల పరిమళాలు ప్రపంచమంతా పంచెనే!!


-మైత్రేయి
01/20/2022


Sunrise or Casandra Garden

 



కనకాంబరాలు దారి తప్పి,
అంబరాన్ని అంటిన వేళ,
కలవరమాయేనే నా మది లో! 

                                                                                                                                                                
     
    
🧡


When Casandra Flowers get lost in the Sky,
My Dil goes Hmmm Hmmmm! 
😍

Sunrise in Jan!

-మైత్రేయి
01/18/2022

సిరిమల్లె పూవల్లె నవ్వు

 


వాలే నీ చిరునవ్వు,
జారే జలపాతమే,
బంధించు భద్రంగా,
ఉండేలా పది కాలాలు పదిలంగా!

-మైత్రేయి
01/01/2022




మల్లెపూవు లాంటి ఓ చిరునవ్వు
నన్ను ఒదిలిపోకె ఎప్పటికి నువ్వు! ❤️

-మైత్రేయి
03/15/2017



సిరివెన్నెల గారికి నా కవితాశ్రు నివాళి

 



Rest in Peace, Sir! 
'నెల రాజు ని ఇల రాణి ని కలిపింది లే సిరివెన్నెల!' ఇంతటి అద్భుత సాహిత్యం సిరివెన్నెల గారి కే సాధ్యం! 



'సిరివెన్నెల' తో ఆరంభించి
'సిరివెన్నెల' తో ముగించి న
నీ సినీ జీవన ప్రయాణం
జగత్తు లో చేసేను నీ పేరు నే సార్థకం!

విరంచి వై ఎన్నొ కూర్పు లు రచించి
మానవాళికి అందిచావు సాహిత్య గుళికలు

విపంచి వై గగనానికి ఎగసిపోయినా
అవి మిగిల్చేను మా మదిలో మరువలేని నీ జ్ఞాపకాలు!!




మీ సాహిత్యాభిమాని
మైత్రేయి
01/28/2022