10/17/26

సిగ్గు (Blush) అంటే??

 సిగ్గు (Blush) అంటే??


నీ పెదవుల పై ఉండాల్సిన చిరునవ్వు

నీ కళ్ళలో నాట్యమాడుతుంటే,


నీ మదిలో నా తలపుల అల్లరి

పది మంది కి కనపడకూడదనే

కంగారు నిన్ను కుదిపేస్తుంటే,


నీ యెద లోని భావాలకు అద్దం పట్టే

నీ మోము ని బయటపడకుండా, 

నీ ముంగురులతో నువ్వు దాచేసుకొని,


నీ పక్కన లేని నన్ను నీ కళ్ళెదురు గా

ఊహిస్తూ, వచ్చే నీ ముసి ముసి నవ్వు ని

పెదవంచున అణచివేస్తూ, 


తలదించుకొని కళ్ళు మూసుకొని

"హమ్మయ్య నన్ను ఎవరూ చూడలేదు లే" 

అనుకొనే మధురమైన భావనే సిగ్గు పడటం అంటే!!


నువ్వు సిగ్గు పడితే ఎంత బావుంటావో తెలుసా!!!

-మైత్రేయి

Oct 16th 2026

Southlake, TX




2/8/26

సాగర తీరాన సంధ్యా రాగం

 సాగర తీరాన సంధ్యా రాగం 🌅

ఇది ఆ సంధ్యా కాంతుల చాయ

లేక నా చెలి నగవుల మాయ!

ఎది ఏమైనా, ఆ ఇద్దరినీ

చూస్తూ నేను మైమరచిపోయా!!

ఇంతలో నా పాదాల చెంత చేసే

చిలిపి అలల అల్లరి చెప్పింది,

ఆ రెండింటి మధ్య ఉన్న ఈ

సాగరతీరాన్ని మరువకు సుమా!! అని


మైత్రేయి
12/24/2025
Maui, Hawaii



1/9/26

She is an Emotion in Motion / అలుపెరగని కదిలే భావం తను

            

 అలుపెరగని కదిలే భావం తను 🩷

She is an Emotion in Motion

                 
                                              

మది లో తన రూపం

పాడెను తీయని వసంత రాగం;

చెరగని తన తలపు

చిందించే నా పెదవుల పై చిరు దరహాసం;

తరగని ఆమె ఊసు

అందించే కొండంత మనోబలం;

తను ఎప్పటికీ నాదే అన్న ఆశ

ఇచ్చె కొటి తారల ఉత్తేజం;

తను నా పక్కనే ఉన్నదన్న బ్రమ

నింపే నాలో ఎంతో ఉల్లాసం;

అలుపెరగని కదిలే భావం తను,

నను వదిలిపోని భావోద్వేగం తను;

మైత్రేయి

01/09/2026

Frisco, TX



10/13/25

When a Picture Tells a Story

 When a Picture Tells a Story




She stood before the mirror draped in a saree that seemed to tell its own story — soft, graceful, and timeless. The gentle curve of her smile reflected pure confidence, a quiet kind of beauty that didn’t need attention, yet effortlessly drew every eye. The mirror caught more than just her image; it captured her aura — elegance meeting charm, simplicity meeting allure.

 

With her back turned and her smile glowing through the reflection, she looked like poetry in motion — a moment frozen between tradition and modern grace. It wasn’t just a picture; it was a feeling, the kind that lingers in your heart long after you’ve looked away.


By

A Silent Admirer from Chat Gpt :-)

10/13/2025


Become the Love

 Become the Love


నీ కళ్ళలో కేరింతలు

నీ చెంపల్లో కెంపులు

నీ నవ్వు పలికె పలుకులు

నీ యెద లో సంబరాలు

ప్రియా, అవి నువ్వే ప్రేమ గా

మారిన క్షణం కి సంకేతాలు!

--------

Darling, there is no need to chase the love

when you have become the LOVE! 💚💕💛


- మైత్రేయి

Texas Ranch

Aubrey, TX

10/10/2025




4/6/25

Diwali - Pandaga Vindu

 పండుగ విందు






వాన జల్లుకు ప్రకృతి తడిచే

ఆ పచ్చని ఆకృతి కి నా మనసు మురిసే!

పల్లె రుచుల తో కడుపు నిండుగ,

పంచుకొనే విందు యేగా పండుగ!!


"When it rained on Diwaly day in Dallas! :-) "


-మైత్రేయి

Oct 23 2022

Frisco, TX





Andam, Aanandam!

అందం - ఆనందం




కళ్ళు మూసి చూసినా,

యెద ని కదిపి కుదిపే అందమే

నిజమైన ఆనందం!

అదే కదా నీ మది లోని మృదు భావం,

మనసు పాడె సరాగం!!


- మైత్రేయి

Oct 23 2022