ఫ్రియతమా!!
వసంత కాలంలోని కోయిల పాటలొ "నీవు"
కొండ మీద నుంచి జారిపడె సెలయేటి గలగలలో "నీవు"
సముద్ర తీరము చేరే ప్రతి కెరటము లో "నీవు"
రేయి ని సైతము పగలు గా మార్చే చల్లని వెన్నెల లో "నీవు"
తేనె కోసము ప్రతి పూవు ని వెతికే తుమ్మెద హొరు లో "నీవు"
కను మూస్తె వచ్చి కరిగిపోయే కలలో "నీవు"
నా కళ్ళలో "నీవు"
నా యెద లోయల్లో "నీవు"
నా గుండె చేసె ప్రతి సవ్వడి లో "నీవు"
ఇన్నింటి లో దాగిన నీవు
నా కన్నుల ముందుకొచ్చి ఎందుకు కనపడవూ?
-మైత్రేయి
05/02/2002,UTD,TX