6/5/20

రా.. రా.. ఓ నా ప్రియా!!





““I was looking forward to a beautiful future, despite the fact that flowers will wither one day …and the fact that this world has flowers that don’t bloom.” ”


నా అధరాల మధురాల రుచి చూడ రా రా!!

నీ బిగి కౌగిలి లో నన్ను బంధించవేమిరా??


నా కలతల కన్నీరు ను నీ ముద్దు మాటల పన్నీరుతో తుడిచివేయ రా రా!!

వెచ్చగా నీ యెద పై నన్ను సేదతీరనీయవేమిరా??


అందాల నా యెద పై హుందా గ కొలువుండ రా రా!!

నీ గుండె లో నన్ను కొలువై ఉండనీయవేమిరా??


నా కనుల నిండా కలకాలం నువ్వే నిలచి ఉండ రా రా!!


-మైత్రేయి 03/31/2003,Richardson,TX

6/4/20

My Love for Coffee







Coffee is my Motivation

Coffee is my Meditation!


Coffee is my Addiction

Coffee is my Relaxation!


Coffee is my Romance

Coffee is my Essence!


Coffee is my Solace

Coffee is my Comfort Place!


Coffee is my Love Affair

Coffee is my Hot Desire!


Coffee is my Cup of Calm

Coffee is my Cup of Warm!


Coffee is my Sweet Dream

Coffee is “The Charm! “




-Mythreyi
06/04/2020, Frisco - TX

8/9/17

Violet Moonlight


VIOLET MOONLIGHT



తెల్లటి వెండి వెన్నెల, నల్లటి మబ్బులని చీల్చుకొని 

భువిని చేరే తాపత్రయం లో మృదువైన ఊదా రంగు గా మారిన

అనుహ్యమైన ప్రక్రియ కి ప్రక్రుతి సైతం పులకరించి పచ్చటి చెట్లు

రజత కాంతులను విరాజిల్లుతున్న 

ప్రశాంతమైన తరుణాన్ని అద్భుతం గా 

బంధించిన చిత్రమిది!


మైత్రేయి

08/09/2017, Frisco, Texas!

4/17/16

విరహ వేదన



చంద్రుని చేరాలనే "కలువ" లా
సూర్యుని చేరాలనే "కమలం" లా
నిన్ను కలవాలనే ఈ "కోమలి"
ఆరాటం నీకు ఎన్నటికి తెలియునో!!!!


-మైత్రేయి


07/09/2003,Richardson,Texas

10/6/14

మనం జతగా ఇలా...!


మనం జతగా ఇలా...!




నీ చెరగని చిరునవ్వు తెచ్చేను నాకు మరింత అందం

  నా మెరుపు లాంటి చూపు ఇచ్చేను నీకు పసిడి తేజం

నీ తోడు నింపేను నా మనసంతా నిండు ధైర్యం

  నా నగుమోము నిలిపేను నీ హుందాతనం

నీ స్పర్శ మీటేను నా మది లోని రాగ తరంగం

  నా కొంటె నవ్వు తట్టి లేపేను నీ లోని కలవరం

సంసారమనే సంద్రం లోని ఒడుకుదుడుకులకు చెదరకుండా

 నిరంతరం సాగే సరాగాల హొయలొలికే అలల లా  

కలకాలం కలిసి ఉందాము మనం జతగా ఇలా...!

-మైత్రేయి 

9/9/2014, Frisco, Texas!

6/3/14

నన్ను నీ దరి చేరనీయవూ!!



నీ నీడలా ఎప్పటికీ నీ వెన్నంటి ఉంటా,

నీ గుండెల్లో గువ్వనై ఒదిగిపోతా

నన్ను నీ దరి చేరనీయవూ!!


నిన్ను నవ్వించే పువ్వునౌతా,

నీ అల్లరిలో సిరిమల్లెనౌతా

నన్ను నీ దరి చేరనీయవూ!!


ముద్దులొలికే నా మోమును నీ ఓడిలో దాచుకొంటా,

నీ బాధను మరిపించే ఒదార్పునౌతా

నన్ను నీ దరి చేరనీయవూ!!


"నన్ను నీ దరి చేర్చుకో!"

-మైత్రేయి


07/10/2003, Richardson,Texas

9/15/13

Our Darling Anvi Turns 5



నా గారాల పట్టీ పారాడె పసి పాదాలని ముద్దాడిన వేళ, 

పరుగెత్తె అల్లరి పిల్లని పట్టుకోలేక విసుగెత్తిన వేళ, 

ఈ గడసరి పలువురిని కవ్వించి మెప్పించిన వేళ,

బడి లో చేరి ఆట పాట నేర్చిన వేళ,  అన్న ని ఆట పట్టించిన వేళ, 

ఇయిదవ వార్షికం లో కి అడుగిడిన వేళ, 

ఈ ఞపకాలూ గుర్తు చేసెనే, నా బుజ్జి పాపాయి ఎదిగి పెద్దదయిందని, 

ఇక పై ఎత్తుకొని ముద్దాడలేనని,  ఒడిలొ లాలించలేనని   కలవరపడె నా మనసు, 

మును ముందు మా చిన్నారి ప్రయొజకురాలై  సుఖ శాంతులతొ వర్ధిల్లాలనే ఎదురు చూపుకు చిహ్నమే కదా!    

Happy 5th Birthday Anvitha!


-మైత్రేయి  

9/15/2013, Frisco,TX