9/15/13

Our Darling Anvi Turns 5



నా గారాల పట్టీ పారాడె పసి పాదాలని ముద్దాడిన వేళ, 

పరుగెత్తె అల్లరి పిల్లని పట్టుకోలేక విసుగెత్తిన వేళ, 

ఈ గడసరి పలువురిని కవ్వించి మెప్పించిన వేళ,

బడి లో చేరి ఆట పాట నేర్చిన వేళ,  అన్న ని ఆట పట్టించిన వేళ, 

ఇయిదవ వార్షికం లో కి అడుగిడిన వేళ, 

ఈ ఞపకాలూ గుర్తు చేసెనే, నా బుజ్జి పాపాయి ఎదిగి పెద్దదయిందని, 

ఇక పై ఎత్తుకొని ముద్దాడలేనని,  ఒడిలొ లాలించలేనని   కలవరపడె నా మనసు, 

మును ముందు మా చిన్నారి ప్రయొజకురాలై  సుఖ శాంతులతొ వర్ధిల్లాలనే ఎదురు చూపుకు చిహ్నమే కదా!    

Happy 5th Birthday Anvitha!


-మైత్రేయి  

9/15/2013, Frisco,TX

5/6/13

ఓ చెలికాడా! నా నెలరేడా !!




ఓ చెలికాడా! నా నెలరేడా !!


ఆరుబయట చిరుగాలి రమ్మని పిలిచింది!

వెచ్చని చలి మంట తన నీడలో చలి కాచుకొమ్మంది!!

విరజాజి విరగపూసి హాయిగా ఆహ్వానిస్తుంది!

మల్లె పందిరి పక్క వేసి పవళించమంది!!

జామిలమ్మ వెన్నెల పరుపు వేసింది!

నీలి గగనం మేఘాలను దిండుగా పంపింది!!


అన్నింటిని మించిన నీ చెలియ చల్లని ఓడిలో సేద తీర రా రా!!!
ఓ చెలికాడా! నా నెలరేడా!!



-మైత్రేయి



04/23/2004,Richardson,TX

8/2/11

The Departure Time


All this longtime made us adhere,
in short notice was set departure;
Whenever you see time here,
reminds you the moments we spent together.
-The Pasam's

-Mythreyi
June 18 2011
Frisco,TX,USA.

10/13/10

నువ్వు నా దరి లేవని...

చల్లని చిరుగాలి నా మేనును తాకి గుర్తు చేసింది
నువ్వు నా దరి లేవని...

మెల్లగా వాన జల్లు నా చెక్కిలిని తడిపి తెలిపింది
నువ్వు నా దరి లేవని...

కనుమరుగైన రవి కిరణాలు కొంటెగా కనుగీటి అన్నాయి
నువ్వు నా దరి లేవని...

నా జడలోని మల్లెల పరిమళాలు అల్లరి చేసెను
నువ్వు నా దరి లేవని...

ప్రకృతి లోని ఈ మధుర భావనలకు
నా మదిలో మెదిలే నీ తలపులు తీపిగా తెలిపాయి
నువ్వు నా దరి లేవని...!!!

-మైత్రేయి
April 17 2010
Bangalore, India

8/4/09

స్నేహితులు

జీవితమనే నందన వనం లో
ఎన్నటికీ వాడని పూవులు నా "స్నేహితులు"

సుదూరంగా సాగే నా జీవన పయనం లో
నను వీడక తోడు గా సాగే బాటసారులు నా "స్నేహితులు"

నా మనసనే నీలి గగనం లో
నిత్యం ప్రకాశించే తారకలు నా "స్నేహితులు"

నా నవ్వును పంచుకుంటూ, కన్నీటిని తుంచి వేస్తూ, ఆలోచనలను సరిదిద్దుతూ,
ఆపదలో ఆదుకొంటూ అండ గా నిలిచే సన్నిహితులు నా "స్నేహితులు"

అలాంటి నా స్నేహితుల కు ఇవే నా నీరాజనాలు!!!!
My Dear Friends, Happy Friendship Day

- మైత్రేయి
08/02/2009, Frisco, TX

5/15/09

వీడ్కోలు


మది నిండా కొత్త ఊహల తో జీవనం సాగించడానికి సిద్ధమైన మిత్రమా!
ఈ పాత నేస్తాల తలపులను మాత్రం మరువకు సుమా!!

మా మంచిని కోరే ఆప్తులు సుదూర తీరాల కు సాగే వేళ,

నీ కలలు నిజమయే క్షణాలు ఇవేనని
నిను నవ్వుతూ సాగనంపనా?

ఇన్నాళు మనం కలిసి గడిపిన సరదా సమయాలు
ఇక నుండి అవి తీపి గురుతులేనని కలత చెందనా ??

మన కలహాలు, కాలక్షేపాలు
అచ్చట్లూ, ముచ్చట్లూ
ఆటా, పాటలు
కొంటె పనులు, చిలిపి సంగతులతో

మా మనసుల లో చెరగని ముద్ర వేసి వీడిపొతున్న ప్రియ నేస్తమా!
నువ్వు కలవరపడతావేమో నని
నీ కంటపడక నా కనురెప్పలోనే దాగిన కన్నీరు,
ఇలా పదజాలమై జారువాలిన వేళ

అందుకో ఈ నా వీడ్కోలు !!!

-మైత్రేయి
05/15/2009, Frisco,Texas

5/12/09

తల్లడిల్లే తల్లి హృదయం




కంటి పాప కు కనురెప్ప లా
చంటి పాప ను కాపాడేది 'అమ్మ '

వెలుగు ను ఇస్తూ కరిగిపోయే కొవ్వొత్తి లా
ప్రేమ ను పంచేది 'అమ్మ '

కనుమరుగైన అల ను అక్కున చేర్చుకొన్న కడలి లా
ఎప్పటికి నన్ను చేరదీసేది 'అమ్మ '

కష్టాలలో ఆదుకొనేది 'అమ్మ '
కన్నీళ్ళలను పంచుకొనేది 'అమ్మ '

నేను ఇల్లాలి నైతే పొంగిపోయింది 'అమ్మ '
నేను తల్లి నైతే మురిసిపోయింది 'అమ్మ '

నేను 'అమ్మ ' అయిన తరువాతే అర్థం చేసుకోగలిగాను
తల్లడిల్లే తల్లి హృదయం
తపన పడే ఈ ప్రేమ మూర్తి ప్రేమానురాగం!!

అమ్మా - Happy Mother's Day May 10 2009


-మైత్రేయి